Sat Dec 14 2024 16:08:39 GMT+0000 (Coordinated Universal Time)
Indian Curency : భారత్ లో నగదు ముద్రించడానికి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా?
భారత దేశంలో నగదు అనేక రకాలుగా తయారు చేస్తారు. రెండు రూపాయల నాణెం నుంచి ఐదు వందల రూపాయల నోటు వరకూ కరెన్సీని ముద్రిస్తారు
భారత దేశంలో నగదు అనేక రకాలుగా తయారు చేస్తారు. రెండు రూపాయల నాణెం నుంచి ఐదు వందల రూపాయల నోటు వరకూ కరెన్సీని ముద్రిస్తారు. అయితే దీనికోసం తయారు చేసే ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలతో భారత్ లో కరెన్సీని కొన్ని చోట్ల మాత్రమే తయారు చేస్తారు. భారత్ దేశంలో నాలుగు చోట్ల మాత్రమే కరెన్సీ తయారు చేస్తారు. నాలుగు చోట్ల నగదు నోట్లను, మరో నాలుగు చోట్ల నాణేలను తయారు చేసే సంస్థలు ఉన్నాయి. ఇక్కడ భారీ బందోబస్తు మధ్య కరెన్సీ తయారవుతుంది.
తయారు చేసేది మాత్రం...
మధ్యప్రదేశ్లోని దేవాస్, మహారాష్ట్రలోని నాశిక్, కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సాల్బొనీలో కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. అలాగే నాణేలను తయారు చేసేందుకు దేశంలో హైదరాబాద్, ముంబై వంటి ప్రదేశాల్లో ఉన్నాయి. మరో రెండు ప్రదేశాల విషయాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే నోట్లు కానీ నాణేలు కానీ ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే అవాక్కవ్వక తప్పదు. దేశ అవసరాలకు సరిపడా కరెన్సీని ఎప్పటికప్పుడు ముద్రిస్తుంటారు. కొత్త కరెన్సీ నోట్ల తయారీ కూడా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు అనుమతితో వీటిని తయారు చేస్తుంటుంది. ఏ ఏ నోట్లు, నాణేలు ఎంత ముద్రించాలన్నది మాత్రం రిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశిస్తుంది.
ముద్రణకు అయ్యే ఖర్చు...
రెండు రూపాయల నాణేం ముద్రించేందుకు రూపాయి ఇరవై ఎనిమిది పైసలు ఖర్చవుతుంది. ఐదు రూపాయల నాణెం ముద్రించేందుకు రూ.3.69, రూ.10 నాణెం ముద్రించేందుకు రూ.5.54 ఖర్చవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఒక రూపాయ నాణేన్ని ముద్రించేందుకు ప్రభుత్వానికి రూ.1.11 ఖర్చవుతుందని చెప్పింది. రూపాయి నాణెం వల్ల ప్రభుత్వానికి అదనపు భారమేనని చెప్పాలి. రెండు వేల రూపాయల నోటును ముద్రించేందుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నాలుగు రూపాయలు మాత్రమే. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే వెయ్యి రూపాయల విలువైన పది రూపాయల నోట్లను ముద్రించాలంటే 960 రూపాయలు ఖర్చవుతుంది. వెయ్యి రూ.100ల నోట్లు ముద్రించేందుకు రూ.1770, వెయ్యి రూ.200ల నోట్లు ముద్రించేందుకు రూ.2370, వెయ్యి రూ.500ల నోట్లు ముద్రించేందుకు రూ.2290 అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అంటే నోటు విలువ కంటే దాని తయారయ్యే ఖర్చు ఎక్కువగానే ఉందని చెప్పాలి.
.
Next Story