Thu Feb 12 2026 14:54:42 GMT+0530 (India Standard Time)
Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఇన్సిడెంట్.. కిలో మీటరు కారు బ్యానెట్ పైనే
బెంగళూరులో దారుణం జరిగింది. ఒక ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు యజమాని బ్యానెట్ పైనే ఉండగా కిలోమీటర్ దూరం తీసుకెళ్లాడు.

బెంగళూరులో దారుణం జరిగింది. ఒక ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు యజమాని బ్యానెట్ పైనే ఉండగా కిలోమీటర్ దూరం తీసుకెళ్లాడు.ఈ కారు యజమాని చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి అతనిపై హత్యాయత్నం కేసును బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరులో ఒక కారు బైక్ పై వెళుతున్న అతనిని ఢీకొట్టింది. అయితే ఢీకొట్టిన వెంటనే కారు ముందుకు వచ్చి ఆ బైకర్ కారును ఆపబోయాడు.
ఆటో అడ్డంగా పెట్టి...
అయితే కారు డ్రైవర్ వేగంగా డ్రైవ్ చేయడంతో బ్యానెట్ పైనే వేలాడుతున్నాడు. దాదాపు కిలో మీటర్ వరకూ కారును డ్రైవర్ బ్యానెట్ పై వ్యక్తి ఉన్నా వెళ్లడాన్ని చూసి అటువైపు వెళుతున్న ఆటో వాళ్లు కారును ఆపేందుకు ప్రయత్నించారు. ఆపకపోవడంతో ఆటోను అడ్డుపెట్టడంతో కారును డ్రైవర్ ఆపాల్సి వచ్చింది. దీంతో బ్యానెట్ పై ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కారు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
Next Story

