Sat Mar 07 2026 22:28:56 GMT+0530 (India Standard Time)
వారం రోజులు మృత్యువుతో పోరాడి... కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన బెంగలూరులోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖానికి, కడుపులో తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ఆధునిక వైద్యాన్ని ఆర్మీ ఆసుపత్రిలో అందిస్తున్నారు. ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్నారు. కానీ చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం వరుణ్ సింగ్ మరణించారు.
14కు చేరిన మృతుల సంఖ్య
ఈ నెల8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో వరుణ్ సింగ్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు 11 మంది మరణించారు. కానీ ఈ ప్రమాదంలో నుంచి బయటపడిన వరుణ్ సింగ్ చికిత్స పొందుతుండటంతో ఆయన బతికి వస్తారని అందరూ భావించారు. కానీ మరణించడంతో హెలికాప్టర్ ప్రమాద మృతుల సంఖ్య 14కు చేరింది.
Next Story

