Thu Mar 19 2026 00:46:27 GMT+0530 (India Standard Time)
Loksabha Elections : నేటితో చివరి దశ ఎన్నికల ప్రచారం సమాప్తం
జూన్ 1వ తేదీన జరిగే చివరి విడత ఎన్నికలకు సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది.

లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. జూన్ 1వ తేదీన జరిగే చివరి విడత ఎన్నికలకు సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా ఎన్నికలు జరిగాయి. చివరి దశ మాత్రం జూన్ ఒకటో తేదీన 57 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
జూన్ 1న పోలింగ్....
ఆరు దశల్లో జరిగిన పోలింగ్ దేశమంతటా ప్రశాంతంగా జరిగింది. పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రశాంతంగానే ముగిశాయి. నేటితో దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని ఫుల్ స్టాప్ పడనుంది. జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనుండగా, పార్లమెంటు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి.
Next Story

