Fri Dec 05 2025 13:19:42 GMT+0000 (Coordinated Universal Time)
Jharkhand : ముఖ్యమంత్రి మార్పు తప్పదా..? వేగంగా మారుతున్న పరిణామాలు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పదవి నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పదవి నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వంలోని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఉన్నపళంగా రాంచీకి చేరుకుంటుడటంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. ఝార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఆయన గత ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్, ఆర్జేడీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలున్నాయి.
ఈడీ దాడులతో...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా వరసగా దాడులు చేస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయనపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటంతో ఆయన కొద్ది రోజుల నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారని భావించి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కల్పనా సోరెన్ ను...
కూటమిలో ఉన్న జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యేలంతా రాంచీకి రావాలన్న ఆదేశాలతో ముఖ్యమంత్రి మార్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమవుతారని చెబుతున్నారు. ఎవరూ నియోజకవర్గాలకు వెళ్లవద్దని రాంచీలోనే ఉండాలని పార్టీలు ఆదేశించడంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి ఆయన స్థానంలో సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ను నియమిస్తారన్న ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతందన్నది చూడాలి.
Next Story

