Fri Dec 05 2025 10:25:57 GMT+0000 (Coordinated Universal Time)
సీఐఎస్ఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదుల దాడి.. జవాన్ మృతి
శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు బస్సుపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ..

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని చద్దా క్యాంపు సమీపంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు బస్సుపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అలర్టయిన జవాన్లు.. ఎదురు కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో బస్సులో 15 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు. కాగా.. నిన్న బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
Next Story

