Wed Apr 08 2026 09:38:52 GMT+0530 (India Standard Time)
BSNL : బీఎస్ఎన్ఎల్ బిగ్ ఆఫర్.. రూపాయికే అన్నీ
బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం అదిరిపోయే ' ఫ్రీడమ్ ప్లాన్' ను మళ్లీ ప్రవేశపెట్టింది.

బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం అదిరిపోయే ' ఫ్రీడమ్ ప్లాన్' ను మళ్లీ ప్రవేశపెట్టింది. కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, ఉచిత సిమ్ కార్డు లభిస్తాయి. ఈ అద్భుత అవకాశం కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ నెల 30వ తేదీ వరకూ...
ఈ ఆఫర్ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది అని X వేదికగా బీఎస్ఎన్ఎల్ ఇండియా పోస్ట్ చేసింది. మిగిలిన అన్ని కంపెనీలు నెలకు మూడు వందల రూపాయలు తీసుకుంటున్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ ఒక్కరూపాయికే ఫ్రీడమ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ దేశంలోని ఏ మూలకు వెళ్లినా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
Next Story

