Fri Dec 05 2025 12:19:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రవాదులు ఎల్ఓసీ వద్ద చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు : ఐజీ అశోక్ యాదవ్
లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటేందుకు ఉగ్రవాదులు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని బీఎస్ఎఫ్ కాశ్మీర్ ఫ్రంట్యర్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు

లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటేందుకు ఉగ్రవాదులు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని బీఎస్ఎఫ్ కాశ్మీర్ ఫ్రంట్యర్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన, శీతాకాలం రాకముందే చొరబాట్ల యత్నాలు పెరుగుతాయని చెప్పారు. మంచు పడే లోపు చొరబడేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు ఉంటాయని, నవంబర్ వరకు యత్నాలు కొనసాగుతాయని, ఆ తర్వాత ఆరు నెలలు అవకాశం తగ్గిపోతుందని వారికి తెలుసునని అశోక్ యాదవ్ చెప్పారు అందుకే ఇప్పుడే లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
భద్రతాదళాల పర్యవేక్షణలో...
కానీ భద్రతా బలగాల అప్రమత్తత వల్ల చొరబడటం చాలా కష్టమన్న ఐజీ అశోక్ యాదవ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎదురుగా బండిపోరా, కుప్వారా సెక్టార్లలో ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్ల వద్ద వేచి ఉన్నారని ఆయన వెల్లడించారు. అవకాశం కోసం వాతావరణం అనుకూలించకపోతే కూడా కాచుకుని కూర్చుంటారని, కానీ భద్రత సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉన్నారని యాదవ్ స్పష్టం చేశారు. ఆర్మీ, బీఎస్ఎఫ్ కలిసి అధునాతన పరికరాలతో లైన్ ఆఫ్ కంట్రోల్ ను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు చోట్ల చొరబాట్ల ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయని, తాము ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలజీ, పరికరాల వల్ల మా పరిధిలో చొరబడటం దాదాపు అసాధ్యమని ఐజీ యాదవ్ స్పష్టం చేశారు.
Next Story

