Sat Dec 06 2025 03:21:17 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలం ఇదే
మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఆదరణ లభించలేదు. కేసీఆర్ ఎంత ఫోకస్ పెట్టినా అక్కడ మాత్రం బీఆర్ఎస్కు ఏమాత్రం చోటు దక్కలేదు

మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఆదరణ లభించలేదు. కేసీఆర్ ఎంత ఫోకస్ పెట్టినా అక్కడ మాత్రం బీఆర్ఎస్కు ఏమాత్రం చోటు దక్కలేదు. తాజాగా నాందేడ్ జిల్లా భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది. మొత్తం పద్దెనిమిది మంది డైరెక్టర్లకు ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవలేదు.
ఏ ఒక్క స్థానంలోనూ...
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పదమూడు, బీజేపీ మూడు, ఎన్సీపీకి రెండు స్థానాలు లభించాయి. అంతే తప్ప బీఆర్ఎస్కు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు. అక్కడ ఆ నాలుగు పార్టీలనే ప్రజలు ఆదరించారు తప్పించి, మూడు సభలు పెట్టి ఎన్నో హామీలు గుప్పించినా కేసీఆర్ ప్లాన్లు మాత్రం వర్క్ అవుట్ కాలేదు.
- Tags
- brs
- maharashtra
Next Story

