Thu Dec 18 2025 09:14:06 GMT+0000 (Coordinated Universal Time)
26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ
ఈ నెల 26వ తేదీన మహారాష్ట్రలో బీఆర్ఎస్ కిసాన్ సమితి బహిరంగ సభను నిర్వహించనుంది.

ఈ నెల 26వ తేదీన మహారాష్ట్రలో బీఆర్ఎస్ కిసాన్ సమితి బహిరంగ సభను నిర్వహించనుంది. కంథార్ లోహాలో ఈ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 5వ తేదీన నాందేడ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ సక్సెస్ కావడంతో మరొక సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కిసాన్ సమితి నేతృత్వంలో ఈ నెల 26న బహిరంగ సభ జరగనుంది.
మరో సభ కోసం....
కేసీఆర్ నాందేడ్ లో బహిరంగ సభను నిర్వహించిన తర్వాతే అక్కడి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో రైతుల్లో ఉత్సాహం పెరిగిందని, తమ ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేయమని కోరుతున్నారని వారంటున్నారు. కంథార్ లోహాలో సభను కూడా భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం పర్యవేక్షిస్తున్నారు.
Next Story

