Fri Dec 05 2025 23:27:31 GMT+0000 (Coordinated Universal Time)
Bihar : పది రోజుల్లో నాలుగో వంతెన కూలింది.. బీహార్ లో ఇదేంది సామీ
బీహార్ లో వరసగా వంతెనలు కూలుతున్నాయి. మరో వంతెన కూలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బీహార్ లో వరసగా వంతెనలు కూలుతున్నాయి. మరో వంతెన కూలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో బీహార్ లో కూలిన నాలగో వంతెన ఇది. బీహార్ లోని కిషన్ గంజ్ లో మళ్లీ మరో వంతెన కూలిపోయింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే బీహార్ లో నాలుగో వంతెన కూలిపోవడంతో వంతెన నిర్మాణాలపై పలు రకాల అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకం, నాణ్యత లేని పనులు చేపట్డడంతోనే వరసగా వంతెనలు కూలుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
భారీ వర్షాల వల్లనే...
భారీ వర్సాల కారణంగా వంతెనలు కూరుతున్నాయి. కిషన్ గంజ్ జిల్లాలోని బహదూర్ గంజ్ బ్లాక్ లో ఉన్న వంతెనకు ఇటీవల మరమ్మతులు చేశారు. 2011లో ఈ వంతెనను నిరమించారు. కంకాయ్, మహానంద నదితో కలిపే వంతెన కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినయోగం అవుతుందన్న విమర్శలు వినిపడుతున్నాయి. అనేక మంది గిరిజనులకు ఉపయోగపడే ఈ వంతెన కూలిపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. నేపాల్ లో కురుస్తున్న వర్షాలకు నదిలో నీటిమట్టం పెరగడంతోనే వంతెన కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.
Next Story

