Tue Feb 03 2026 13:36:33 GMT+0000 (Coordinated Universal Time)
వరుడికే కాదు.. కళ్యాణ మండపంలోని అందరికీ షాకిచ్చిన వధువు తండ్రి
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ వరుడు సకాలంలో వివాహ వేదిక వద్దకు రాకపోవడంతో.. ఓ యువతికి ముందుగా నిర్ణయించిన..

పెళ్లికి ముహూర్తం దగ్గర పడిన సమయంలో ఊహించని మలుపులు చోటు చేసుకునే సంఘటనలు ఎన్నో సినిమాల్లో చూశాం..! అప్పుడప్పుడు నిజంగా కూడా అలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అలా ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పెళ్లి కొడుకు ముహూర్తానికి కళ్యాణ మండపానికి రాకపోవడంతో ఏకంగా వరుడినే మార్చేశారు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ వరుడు సకాలంలో వివాహ వేదిక వద్దకు రాకపోవడంతో.. ఓ యువతికి ముందుగా నిర్ణయించిన వ్యక్తితో కాకుండా పెళ్ళికి వచ్చిన బంధువుల్లో వరుసయ్యే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏప్రిల్ 22న బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాయంత్రం 4 గంటలకు పెళ్లి వేడుకకు ముహూర్తం పెట్టారు. వధువు, ఆమె కుటుంబ సభ్యులు వరుడు వేదిక వద్దకు చేరుకునే వరకు వేచి ఉన్నారు, కాని అతను సాయంత్రం 8 గంటల వరకు మండపం వద్దకు రాలేదు. వరుడు, అతని స్నేహితులు తాగుతూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు.
పెళ్లి కొడుకు మద్యం మత్తులో మునిగిపోయాడనే విషయం వధువు తండ్రికి తెలిసింది. అదే పెళ్లి వేడుకలో తన బంధువుకు కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. వధువు, ఆమె తరపు బంధు మిత్రులు అందరూ వరుడు ఇక వస్తాడులే అనుకుంటూ రాత్రి 8 గంటల వరకు చూశారు. ఆ తర్వాత వరుడు మద్యం సేవించి డ్యాన్స్ చేస్తూ పెళ్లి మంటపానికి చేరుకోవడంతో.. తన కుమార్తెను అతడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించాడు. పెళ్లి చూడ్డానికి వచ్చిన బంధువుకు ఇచ్చి వివాహం చేయడంతో పాత పెళ్లి కొడుకు తరపున వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.
Next Story

