Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Tamilanadu : చెన్నైలో ప్రముఖులకు బాంబు బెదిరింపు మెయిల్స్
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని పలువురు ప్రముఖులకు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో పాటు అనేకమంది నివాసాల్లో బాంబులు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడంతో వెంటనే పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఎక్కడి నుంచి వచ్చాయని...
ముఖ్యమంత్రి స్టాలిన్. సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే బాంబ్ స్క్కాడ్, డాగ్ స్వ్కాడ్ లతో క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

