Fri Dec 05 2025 16:43:52 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాదాపు ముప్ఫయి స్కూళ్లకు పైగానే ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాదాపు ముప్ఫయి స్కూళ్లకు పైగానే ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే బాంబ్ డిస్పోజబుల్ స్క్కాడ్ రంగంలోకి దిగి పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పాఠశాలల నుంచి విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపి తనిఖీలు చేసింది.
తనిఖీలు చేస్తూ...
డాగ్ స్వ్కాడ్ తోనూ తనిఖీలు నిర్వహిస్తుంది. పోలీసులు పాఠశాలల వద్ద పహారా కాస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. ఇటీవల తరచూ ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. ఆకతాయిలు చేసిన పనా? లేక మరేదైనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని సైబర్ వింగ్ పరిశీలిస్తుంది.
Next Story

