Sun Mar 08 2026 00:06:16 GMT+0530 (India Standard Time)
బీహార్ లో భారీ పేలుడు .. ఐదుగురి మృతి
బీహార్ జిల్లాలో దారుణం సంభవించింది. భారీ పేలుడు జరిగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

బీహార్ జిల్లాలో దారుణం సంభవించింది. భారీ పేలుడు జరిగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో మరో పది మందికి పైగా గాయపడినట్లు తెలిసింది.
పేలుడుకు గల కారణాలు....
బీహార్ లోని తాతార్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజ్వాలీచక్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
- Tags
- bomb blast
- bihar
Next Story

