Sun Feb 01 2026 23:00:20 GMT+0000 (Coordinated Universal Time)
సోనూసూద్ కీలక నిర్ణయం
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పంజాబ్ స్టేట్ ఐకాన్ హోదా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పంజాబ్ స్టేట్ ఐకాన్ హోదా నుంచి తప్పుకుంటున్నట్లు సోనూ సూద్ ప్రకటించారు. పంజాబ్ ప్రభుత్వం ఇటీవల సోనూ సూద్ ను స్టేట్ ఐకాన్ గా ఎంపిక చేసింది. ఆ హోదా ఇచ్చింది. కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు ఈ హోదా పంజాబ్ ప్రభుత్వం కల్పించింది. ఎందరినో ఉపాధి కార్మికులను తమ స్వగృహాలకు సోనూసూద్ తన సొంత ఖర్చుతో తరలించారు.
సోదరి పోటీతో.....
దీంతో పంజాబ్ ప్రభుత్వం సోనూసూద్ కు అరుదైన గౌరవం ఇచ్చింది. కానీ పంజాబ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ పోటీ చేయనున్నారు. ఈ కారణం వల్లనే తాను ఐకాన్ హోదా నుంచి తప్పుకుంటున్నట్లు సోనూ సూద్ ప్రకటించారు.
Next Story

