Mon Oct 14 2024 06:06:14 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి. తుపాకీని శుభ్రపరుస్తుండగా గన్ పేలడంతో గాయాలయ్యాయి.
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. తన తుపాకీని ఉదయం శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలిందని తెలిసింది. తుపాకీని శుభ్రపరుస్తుండగా గన్ పేలడంతో గాయాలయ్యాయి.
కాలిలోకి బుల్లెట్...
ఈ ప్రమాదంలో నటుడు గోవిందా కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో వెంటనే సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాలి నుంచి బుల్లెట్ ను తొలగించిన వైద్యులు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Next Story