Sat Dec 13 2025 22:31:40 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటులలో ధర్మేంద్ర ఒకరు. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు కాగా, ఒకరు ప్రకాశ్ కౌర్, మరొకరు హేమమాలిని. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. 1960లో 'దిల్ బీ తేరా హమ్ బీ తేరా'తో ధర్మేంద్ర నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్' త్వరలో విడుదల కానుంది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది.
Next Story

