Fri Dec 05 2025 16:43:53 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ కోర్టులో పేలుడు... ఉలిక్కి పడిన న్యాయవాదులు
ఢిల్లీలోని న్యాయస్థానంలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో ఈరోజు ఉదయం పేలుడు సంభవించడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.

ఢిల్లీలోని న్యాయస్థానంలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో ఈరోజు ఉదయం పేలుడు సంభవించడంతో ఒక్కసారి అంతా ఉలిక్కి పడ్డారు. కోర్టు ఆవరణ నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పేలుడు జరిగిన ఘటనపై విచారణ ప్రారంభించారు. చివరకు ల్యాప్ ట్యాప్ బ్యాటరీ పేలిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ల్యాప్ టాప్ బ్యాటరీ....
ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో కో్టు రూమ్ నెంబరు 102 నుంచి పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయంతో పరుగులు తీశారు. పోలీసుల వచ్చి చూడగా అక్కడ ల్యాప్ ట్యాప్ పేలిపోయి ఉండటాన్ని గమనించారు. ల్యాప్ ట్యాప్ బ్యాటరీ సాంకేతిక సమస్యతో పేలిందని నిర్ధారణకు వచ్చారు. మంటలను అగ్నమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
Next Story

