Fri Feb 20 2026 13:43:44 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి
ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి అయింది.

ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి అయింది. నేడు పలు అభివృద్ధి, టూరిజం ప్రాజెక్టులను ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రారంభించనున్నారు. ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధాన సమస్యలకు...
ఢిల్లీలో ప్రధాన సమస్య అయిన కాలుష్యం నివారణకు అవసరమైన చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా చెబుతున్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను కూడా అమలు చేసేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించామని, ఇప్పటికే చాలా వరకూ పూర్తి చేసినట్లు రేఖా గుప్తా తెలిపారు.
Next Story

