Sun Mar 15 2026 14:45:15 GMT+0530 (India Standard Time)
BJP : మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చిన ప్రజలు
మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలయింది.

మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలయింది. ఉద్దవ్ థాక్రేకు చెందిన శివసేన గెలిచింది. ముంబయి గ్రాడ్యుయేట్స్, ముంబై టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు రెండింటినీ కూడా శివసేన (ఉద్దవ్ థాక్రే) గెలుచుకుంది. ముంబై గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థి అనిల్ పరబ్ బీజేపీకి చెందిన కిరణ్ షెలార్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో...
ముంబై టీచర్స్ స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థి జేఎం అభ్యంకర్ విజయం సాధించారు. కొంకణ్ గ్రాడ్యుయేట్స్ స్థానంలో మాత్రం భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి నిరంజన్ దావ్ఖరే కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కీర్పై విజయం సాధించారు. నాసిక్ టీచర్స్ నియోజకవర్గంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన కిషోర్ దారాడే విజయం సాధించారు.
Next Story

