Sun Mar 15 2026 03:29:45 GMT+0530 (India Standard Time)
గోవాలో బీజేపీకి ఝలక్... పారికర్ రాజీనామా
గోవా ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మనో హర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు

గోవా ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి అత్యంత నమ్మకమైన కుటుంబంగా పేరుగాంచిన పారికర్ ఫ్యామిలీ కమలం పార్టీకి ఝలక్ ఇచ్చింది. మనో హర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను పనాజీ నుంచి పోట ీచేస్తానని ప్రకటించారు. పారికర్ మరణించిన తర్వాత బీజేపీ ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
స్వతంత్ర అభ్యర్థిగా...
అయితే ఉత్పల్ పారికర్ తనకు పనాజీ టిక్కెట్ కావాలని కోరారు. గతంలో మనోహర్ పారికర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. దీంతో తనకు పనాజీ టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇవ్వాలని నిర్ణయించడంతో ఉత్పల్ పారికర్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాను పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
Next Story

