Fri Mar 27 2026 23:03:20 GMT+0530 (India Standard Time)
రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర కార్యాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. జగదీప్ థన్ ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరగనుంది.
ఎన్డీఏ నుంచి...
ఎన్డీఏ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పార్టీ నాయకత్వం ఖరారు చేయనుంది. అయితే ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఇంకా ఎటువంటి లీకులు రాలేదు. ఈనెల 21వ తేదీ వరకు ఉపరాష్ట్రపతి నామినేషన్ల గడువు ఉంది. ఉభయ సభల్లో బీజేపీ అభ్యర్థుల బలంగా ఉండటంతో ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థి ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలున్నందున రాజకీయ పరిణామాలను అనుసరించి ఎంపిక జరుగుతుందని అంటున్నారు.
News Summary - bjp parliamentary board meeting will be held tomorrow. vice presidential candidate will be finalized in this meeting
Next Story

