Mon Dec 15 2025 20:21:40 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు విచారణకు రాలేను
తాను ఈ నెల 10వ తేదీ విచారణకు హాజరవుతానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు

తాను ఈ నెల 10వ తేదీ విచారణకు హాజరవుతానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన వరంగల్ డీసీపీకి లేఖ రాశారు. తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 10వ తేదీ ఉదయం పదకొండు గంటలకు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు.
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో...
పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఈటల రాజేందర్‌కు వరంగల్ పోలీసుుల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు హాజరుకావాలని నోటీసులు అందించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను ఈరోజు హాజరు కాలేనని, ఈ నెల పదో తేదీన హాజరవుతానని తెలిపారు.
Next Story

