Sun Mar 15 2026 14:04:34 GMT+0530 (India Standard Time)
పోస్టల్ బ్యాలట్ లో బీజేపీ ముందంజ
గుజరాత్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది

గుజరాత్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ స్థానాలకు గాను 23 స్థానాల్లో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉందని సమాచారం.
182 నియోజకవర్గాల్లో...
గుజరాత్ లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లోనూ బీజేపీ ముందంజలో ఉంది. నియోజకవర్గాల్లో లెక్కింపు ఇంకా మొదలు కావాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల వారీగా లెక్కింపు ప్రారంభమవుతుంది. 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరికాసేపట్లో లెక్కింపు ప్రారంభమవుతుంది.
Next Story

