Fri Dec 05 2025 12:37:32 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ప్రచారం చేసిన చోట ట్రెండ్ ?
ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దాదాపు నలభై స్థానాల్లో బీజేపీ అధికారంలో ఉంది.

ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దాదాపు నలభై స్థానాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మొదటిరౌండ్ పూర్తయిన తర్వాత బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండగా, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది.
షహాదరాలో...
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారంచేసిన నియోజకవర్గంలోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చివరి రోజున బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న షహాదరాలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం షహాదరా లో ఆధిక్యంలో బీజేపీ ఉంది.
Next Story

