Sat Feb 21 2026 14:57:19 GMT+0530 (India Standard Time)
Delhi : ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున నిరసన తెలుపుతున్నాయి

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున నిరసన తెలుపుతున్నాయి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేడు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. దేశంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడించాలని, అక్కడ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా...
దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా బీజేపీ శ్రేణులు చేరుకుని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ భారీ నిరసనకు దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ దేశం పరువును దిగజారుస్తుందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో దేశంలోని అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Next Story

