Sun Mar 26 2023 09:43:38 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రిగా మళ్లీ బీరేన్ సింగ్
మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు

మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. ఇంఫాల్ లో ఆదివారం జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరోసారి మణిపూర్ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టనున్నారు. ఆయన ఐదోసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
రెండోసారి అధికారంలోకి....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మణిపూర్ లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో మిత్ర పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఈసారి సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. పార్టీకి విజయం సాధించి పెట్టడంలో బీరేన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. దీంతో బీజేపీ అధిష్టానం మరోసారి ఆయనను ముఖ్యమంత్రి గా ఎంపిక చేసింది.
Next Story