Sun Mar 15 2026 12:31:05 GMT+0530 (India Standard Time)
13 మంది మృతి.. బిపిన్ సేఫ్
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.

హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించగా బిపిన్ రావత్ ఒక్కరే ప్రాణాలతో ఉన్నారు. ఆయనను వెంటనే అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆర్మీ అత్యంత గోప్యతను పాటిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి మధులిక మరణించారు.
డీఎన్ఏ పరీక్షల ఆధారంగా....
ప్రమాదం తర్వాత అక్కడకు చేరుకున్న స్థానికులు వెంటనే బిపిత్ రావత్ ప్రాణాలతో ఉండటం చూశారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 14 మంది లో 13 మంది మరణించారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా వీరి మృతదేహాలను గుర్తిస్తున్నారు.
Next Story

