Sat Mar 07 2026 20:16:13 GMT+0530 (India Standard Time)
ఏలూరు ఘటన : మృతులకు పరిహారం ప్రకటించిన బీహార్ ప్రభుత్వం
మరణించిన వారిలో నలుగురు బీహార్ కు చెందిన కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ పరిహారం

బీహార్ : ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కర్మాగారంలో రియాక్టర్ పేలి గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడడం తెలిసిందే. మరణించిన వారిలో నలుగురు బీహార్ కు చెందిన కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు నితీశ్ వెల్లడించారు.
అలాగే క్షతగాత్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఢిల్లీలోని బీహార్ రెసిడెంట్ కమిషనర్ కు స్పష్టం చేశారు.
Next Story

