Mon Dec 08 2025 06:34:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీహార్ లో మంత్రి వర్గ విస్తరణ
నేడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు

నేడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో రాష్ట్రీయ జనతాదళ్ నుంచి పదహారు మంది, జేడీయూ నుంచి 13 మంది మంత్రివర్గంలో ఉండే అవకాశాలున్నాయి. మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆర్జేడీకే అధిక శాఖలు...
ఇటీవల నితీష్ కుమార్ బీజేపీ కూటమిని వీడి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో జత కట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో నితీష్ కుమార్ విస్తరించనున్నారు.
Next Story

