Wed Jan 28 2026 06:58:47 GMT+0000 (Coordinated Universal Time)
Bihar Assembly Elections : బీహార్ ఎన్నికలకు అంతా సిద్ధం
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు

బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మొత్తం నాలుగు లక్షలమందికి పైగా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించామని అధికారులు తెలిపారు. మలి దశలో 122 నియోజకవర్గాల్లో 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగేలా నాలుగు లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని బిహార్లో నియమించారు.
భారీ పోలీసు బందోబస్తు...
ఇప్పటికే 500 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది రాష్ట్రానికి చేరుకున్నారు. అనంతరం మరో 500 కంపెనీల సీఏపీఎఫ్ సిబ్బందిని మూడో వారంలో పంపించారు. అదనంగా 60 వేలమంది బిహార్ పోలీసు సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. క, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2 వేల రిజర్వ్ బెటాలియన్ సిబ్బంది, 30 వేలమంది బిహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, 20 వేలమంది హోంగార్డులు, 19 వేలమంది శిక్షణలో ఉన్న కొత్త కానిస్టేబుళ్లు, సుమారు 1.5 లక్షలమంది చౌకీదార్లు రెండు దశల ఎన్నికల కోసం విధుల్లో ఉన్నారని తెలిపారు.
Next Story

