Sat Dec 13 2025 22:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఫలితాలివే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు వచ్చాయి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు వచ్చాయి. ఇంుదలో బీజేపీకి 89 స్థానాలు దక్కించుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. లోక్ జనశక్తి పార్టీ ( రామ్ విలాస్ పాశ్వాన్) కు చెందిన పార్టీకి పందొమ్మిది స్థానాలు వచ్చాయి. ఆర్ఎల్ఎంకు నాలుగు స్థానాలు, హెచ్ఏఎం(ఎస్) కు ఐదు స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్డీఏకు 202 స్థానాలు లభించాయి.
మహా ఘట్ బంధన్ కు...
మరొకవైపు బీహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ లోని పార్టీలు కేవలం 34 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఇరవై ఐదు స్థానాల్లో గెలిచింి. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ ఎంఎల్ పార్టీ రెండు, సీపీఐ( ఎం) పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ, ఐఐపీ చెరో ఒక స్థానాల్లో విజయం సాధించింది.
Next Story

