Sun Mar 15 2026 15:00:30 GMT+0530 (India Standard Time)
బీజేపీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు
త్రిపురలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.

త్రిపురలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ సాహాలు ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. త్రిపురలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.
33కు పడిపోయినా....
అయితే రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. త్రిపురలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 60. వీరిద్దరి రాజీనామాతో అధికారంలో ఉన్న బీజేపీ బలం 33కు చేరుకుంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ త్రిపుర అధ్యక్షుడు మాణిక్ సాహా కొట్టిపారేశారు. బీజేపీకి తగినంత బలం ఉందని ఆయన చెప్పారు.
Next Story

