Sat Dec 06 2025 08:39:50 GMT+0000 (Coordinated Universal Time)
ఖుష్బూకు కీలక పదవి
భారతీయ జనతా పార్టీ నేత ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది

భారతీయ జనతా పార్టీ నేత ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూకు ఈ లభించడం విశేషం.
అభిమానుల్లో ఆనందం...
ఖుష్బూతో పాటుగా సీనియర్ సినీ ఆర్టిస్ట్ మమతా కుమారి, డెలీనా ఖోంగ్డుప్ లను కూడా జాతీయ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఖుష్బూకు ఈ పదవి లభించడంపై ఆమె అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఖుష్బూ సేవలను అధినాయకత్వం గుర్తించిందని ట్వీట్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా ఖుష్బూకు పదవి లభించడంపై అభినందనలు చెబుతున్నారు.
Next Story

