Sun Mar 15 2026 21:20:09 GMT+0530 (India Standard Time)
నేడు పంజాబ్ ముఖ్యమంత్రిగా మాన్
పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ గ్రామంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ భగవంత్ మాన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు.
భగత్ సింగ్ గ్రామంలో....
ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 117 స్థానాలకు గాను 92 స్థానాలను దక్కించుకుని పంజాబ్ లో అధికారంలోకి రాగలగింది. ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ ను అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈరోజు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరు కానున్నారు.
Next Story

