Sun Mar 15 2026 21:20:36 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి కాబోయే పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్ నేడు ఢిల్లీకి రానున్నారు

పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్ నేడు ఢిల్లీకి రానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో ఆయన సమావేశం కానున్నారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలను భగవంత్ మాన్ ఆహ్వానించనున్నారు. పంజాబ్ ఎన్నికలకు ముందే ప్రజాభిప్రాయం మేరకు భగవంత్ మాన్ ను ఆప్ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
భగత్ సింగ్ గ్రామంలో....
అనుకున్నట్లుగానే పంజాబ్ లో 92 అసంబ్లీ స్థానాలను సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించింది. మాజీ ముఖ్యమంత్రులను సయితం ఓడించింది. ఇప్పటికే భగవంత్ మాన్ తాను రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోనని తెలిపారు. భగత్ సింగ్ సొంత గ్రామంలో ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. మాన్ కు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

