Fri Mar 20 2026 13:18:42 GMT+0530 (India Standard Time)
మరో ప్రముఖ నటుడు మృతి!
అభిషేక్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ ఛటర్జీ హఠాన్మరణం చెందారనే వార్త తనను

బెంగాలీ చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ(58) నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ.. ఆయన మరణానికి గల అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అభిషేక్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
అభిషేక్ ఛటర్జీ హఠాన్మరణం చెందారనే వార్త తనను కలచి వేసిందని అన్నారు. అభిషేక్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని కొనియాడారు. విలక్షణమైన నటనతో అందరినీ అలరించారని చెప్పారు. ఆయన మరణం సినీ, టీవీ రంగాలకు తీరని లోటు అని, అభిషేక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1985లో 'పాత్ భోలా' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిషేక్ 100కు పైగా సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
Next Story

