Sat Mar 21 2026 20:46:19 GMT+0530 (India Standard Time)
బ్యాడ్ లక్... బంగారం ధర బాగానే పెరిగింది
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకూ స్థిరంగా, కొంచెం తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు కొంత వెనకడుగు వేయక తప్పదు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ఒడిదుడుకుల ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
మార్కెట్ లో ...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,100 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,200 రూపాయలు ఉంది. ఇక వెండి ధరలు కూడా బాగానే పెరిగాయి. వెండి కిలోకు 150 రూపాయలు పెరిగింది. మార్కెట్ లో ప్రస్తుతం కిలో వెండి 63,200 రూపాయలు ఉంది.
Next Story

