Thu Mar 19 2026 06:51:01 GMT+0530 (India Standard Time)
ఐఏఎస్ కుమారుడి మృతి.. హత్యా.. ఆత్మహత్యా?
పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి సంజయ్ కుమారుడు కార్తీక్ మృతి చెందాడు

పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి సంజయ్ కుమారుడు కార్తీక్ మృతి చెందాడు. అదే సమయంలో సంజయ్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లోనే సంజయ్ కుమారుడు కార్తీక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తనకు తానే కాల్చుకుని కార్తీక్ చనిపోయాడని పోలీసు అధికారులు చెబుతున్నారు.
విజిలెన్స్ దాడుల్లో....
పంజాబ్ లోని ఐఏఎస్ అధికారి సంజయ్ ఇటీవల అవినీతి కేసులో అరెస్టయ్యారు. విజిలెన్స్ అధికారుల దాడిలో 12 కిలోల బంగారం, మూడు కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం కార్తీక్ పోలీసు కాల్పుల్లోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.
Next Story

