Fri Dec 05 2025 13:51:25 GMT+0000 (Coordinated Universal Time)
భూమి మీదకు శుభాంశు శుక్లా
నేడు భూమి మీదకు వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగిరానున్నారు.

నేడు భూమి మీదకు వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగిరానున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కాలిఫోర్నియా తీరంలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది. స్పేస్ నుంచి భూమి మీదకు శుభాంశు, పెగ్గీ విట్సన్ తిరిగిరానున్నారు. వీరితో పాటు స్లావోస్జ్ ఉజ్నాన్స్ కీ-విస్నియొస్కీ, టిబర్ కపు కూడా భూమి మీదకు చేరుకుంటారు.
పద్దెనిమిది రోజులపాటు...
ఐఎస్ఎస్ లో పద్దెనిమిది రోజులపాటు వివిధ ప్రయోగాలు చేసిన శుభాంశు శుక్లా బృందం నేడు స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరనుంది. అయితే భూమిపైకి వచ్చిన తర్వాత వ్యోమగాములు భూమిపై వాతావరణానికి అలవాటుపడేందుకు ఇస్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారం రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్లోనే వ్యోమగాములు ఉండనున్నారు.
Next Story

