Wed Feb 19 2025 22:14:49 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు .. కేకే సర్వే మాత్రం?
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీకే విజయావకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ సంస్థ తమ సర్వే లో తేల్చింది. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 51 నుంచి 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ పది నుంచి పందొమ్మిది స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. అలాగే కాంగ్రెస్ కు జీరో స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ తెలిపింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీజేపీకి 38 నుంచి 41స్థానాలు వస్తాయని తెలిపింది.
ఆప్ కు అనుకూలంగా కేకే సర్వే...
ఆప్ 27 నుంచి 30 స్థానాలు వస్తాయని తెలిపింది. చాణిక్యస్ట్రాటజీస్ బీజేపీకి 39 స్థానాలు వస్తాయని సర్వేలో తేల్చింది. 25 స్థానాలు వస్తాయని తెలిపంది. కేకే సర్వేలో మాత్రం బీజేపీకి 22 స్థానాలు వస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఆమ్ ఆద్మీపార్టీ మాత్రం 39 స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది. ఏబీపీ మ్యాట్రిజ్ సంస్థ మాత్రం బీజేపీ యాభై స్థానాలు దక్కించుకుంటుందని చెప్పగా, ఆమ్ ఆద్మీపార్టీ 32 నుంచి 37 స్థానాలు వస్తాయని తెలిపింది. ఎక్కువ సంస్థలు బీజేపీకే ఆధిక్యాన్ని ప్రకటించాయి.
Next Story