Tue Mar 17 2026 17:43:18 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ మ్యానిఫేస్టో పాకిస్థాన్ కు సరిపోతుంది
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. ఆ మేనిఫెస్టో భారత్ కంటే పాకిస్థాన్లో ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందన్నారు. అధికారంలోకి రావడానికి సమాజాన్ని విభజించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు.
బుజ్జగింపు రాజకీయమంటూ...
ఇది బుజ్జగింపు రాజకీయమని హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే కదా? చెప్పేందుకు ఆలోచించేది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదని ఆయన అన్నారు.
Next Story

