Fri Dec 05 2025 20:18:15 GMT+0000 (Coordinated Universal Time)
కేజ్రీవాల్ క్రేజీ ఆఫర్
అరవింద్ కేజ్రీవాల్ గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో అభ్యర్థుల తరుపున పర్యటించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన గోవాలో పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో అభ్యర్థుల తరుపున పర్యటించారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా గోవా యువతకు క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే మూడు వెేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు.
ప్రతి మహిళకు....
గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న కేజ్రీవాల్ ఓటర్లకు అనేక వరాలు కురిపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భూమి హక్కులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో మొహల్లా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి మహిళకకు నెలకు వెయ్యి రూపాయలు సాయం అందిస్తామని చెప్పారు.
Next Story

