Mon Feb 02 2026 03:20:10 GMT+0000 (Coordinated Universal Time)
కశ్మీర్ లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి
విధుల్లో భాగంగా ఫార్వార్డ్ ఏరియాలో గస్తీ కాస్తున్న సమయంలో.. మంచు పెళ్లలు విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

జమ్మూకశ్మీర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ముగ్గురు సైనికులు కశ్మీర్ లోయలో పడి అమరులయ్యారు. విధుల్లో భాగంగా ఫార్వార్డ్ ఏరియాలో గస్తీ కాస్తున్న సమయంలో.. మంచు పెళ్లలు విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఉన్నట్లు తెలిపారు.
మంచు పెళ్లలు విరిగిపడటంతో.. ముగ్గురూ లోయలో పడిపోయారని తెలిపారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా.. అమరులైన జవాన్లకు సంబంధించిన పేర్లు, వివరాలను మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు.
Next Story

