Tue Jul 15 2025 16:30:24 GMT+0000 (Coordinated Universal Time)
విదేశాలకు బ్లాక్ బాక్స్ ను పంపిస్తున్నారా?
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత అధికారులు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషించాల్సి ఉండగా దాన్ని విదేశాలకు తరలిస్తారంటూ వచ్చిన కథనాలపై కేంద్రం స్పందించింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ లతో కూడిన బ్లాక్ బాక్స్‌లు రెండు ఉంటాయి. జూన్ 13న ఒకదాన్ని, జూన్ 16 మరోదాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎక్కడ డీకోడ్ చేయాలనేది ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీ, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. సైట్ డాక్యుమెంటేషన్, ఆధారాల సేకరణ సహా కీలకమైన రికవరీ పనులు పూర్తయ్యాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది.
Next Story