Sat Mar 07 2026 18:40:40 GMT+0530 (India Standard Time)
రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా..

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి విజ్ఞాపనలు చేయనున్నట్లు సమాచారం. అలాగే ఏపీ కొత్తజిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై కూడా ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై సీఎం జగన్ చర్చలు జరిపే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంపై కూడా జగన్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న పలు కార్యక్రమాలు, పనులపై కూడా ఆయన చర్చిస్తారు. మోదీతో భేటీకి సీఎంఓ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయగా.. అమిత్ షా తో భేటీకి ఇంకా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవలేదు.
Next Story

