Thu Mar 19 2026 01:10:17 GMT+0530 (India Standard Time)
బాలీవుడ్ లో మరో విషాదం.. బప్పీలహరి మృతి
బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి మృతి చెందారు.

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి మృతి చెందారు. ఇటీవలే లతా మంగేష్కర్ మృతి నుంచి బాలీవుడ్ తేరుకోక ముందే మరో దిగ్గజ సంగీత దర్శకుడు మృతి చెందాడు. బప్పీలహరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బప్పీలహరి మృతి చెందారు.
తెలుగు చిత్రాలకు .....
బప్పీలహరి అనేక హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన అందించిన అనేక పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యారు. 69 ఏళ్ల బప్పీ లహరి కన్నుమూయడంతో బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. బప్పీలహరి పలు తెలుగు చిత్రాలకు కూడా సంగీ దర్శకతర్వం వహించారు. ముఖ్యంగా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, కృష్ణ నటించిన సింహాసనం వంటి ిసినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
Next Story

