Wed Mar 18 2026 04:56:11 GMT+0530 (India Standard Time)
Breaking : తమిళనాడులో కొత్త పార్టీ ...పేరు ఖరారు
తమిళనాడులో మరో పొలిటికల్ పార్టీ రానుంది. సినీ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమయింది

తమిళనాడులో మరో పొలిటికల్ పార్టీ రానుంది. సినీ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమయింది. ఆయన పార్టీ పేరును కూడా ప్రకటించారు. తమిళ వెట్రి కళగం పేరును విజయ్ ప్రకటించారు. తమిళనాడులో హీరో విజయ్ కు పెద్దయెత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన గత కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారని అనుకుంటున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా అభిమానులతో సమావేశమవుతున్నారు.
లేఖను విడుదల చేసి...
దీనికి తెరదించుతూ పార్టీ పేరును ప్రకటించడంతో ఆయన ఎంట్రీ ఖాయమయినట్లు తేలిపోయింది. అయితే విజయ్ కొత్తగా పెట్టిన పార్టీ రానున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పుడు ప్రకటించారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story

