Tue Mar 24 2026 14:31:54 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్.. భారత్ కు మరో రెండు ఎల్.పి.జి నౌకలు
ఎల్.పి.జి కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్ అందింది

ఎల్.పి.జి కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్ అందింది. భారత్కు మరో రెండు ఎల్పీజీ తో కూడిన నౌకలు చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' ఎల్పీజీ నౌకలు బయలుదేరాయి. త్వరలోనే అవి భారత్ కు చేరుకుంటాయి.
కమర్షియల్ గ్యాస్ కూడా...
'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' నౌకలు 92,612 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకొస్తున్నాయి. ఈ నెల 26 నుంచి 28వ తేదీ లోపు భారత్లోని పోర్టులకు రెండు నౌకలు చేరుకోనున్నాయి. దీంతో భారత్ లో ఎల్.పి.జి సమస్య కూడా చాలా వరకూ తీరుతుందని, కమర్షియల్ సిలిండర్ల సరఫరా కూడా మెరుగుపడే అవకాశముందని చెప్పింది.
Next Story

